నీట్ పేపర్ లీక్.. వెలుగులోకి సంచలన విషయాలు

84చూసినవారు
నీట్ పేపర్ లీక్.. వెలుగులోకి సంచలన విషయాలు
నీట్‌- యూజీ 2024 పరీక్ష లీకేజీపై విచారణ కొనసాగుతోంది. బిహార్‌లోనే నీట్ పరీక్ష పత్రం లీక్ అయినట్లు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో బిహార్ ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన దర్యాప్తులో సంచలనాలు బయటకొస్తున్నాయి. పేపర్ లీకేజీ చేసిన గ్యాంగ్‌లో బిహార్ ప్రభుత్వం విభాగంలో పనిచేసే జూనియర్ ఇంజనీర్ ఉన్నాడు. నీట్ పేపర్ లీక్ చేసినందుకు స్టూడెంట్ల దగ్గర్నుంచి రూ.30 నుంచి రూ.32 లక్షల చొప్పున వసూలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు బయటకొచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్