ముళ్ల పొదలో నవజాత శిశువు.. మృతి

79చూసినవారు
ముళ్ల పొదలో నవజాత శిశువు.. మృతి
AP: పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలంలో ఘోరం జరిగింది. నడిగడ్డ గ్రామంలో రోడ్డు పక్కన ముళ్ల పొదలో నవజాత శిశువును పడేశారు. శిశువు ఏడుపు విన్న స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. శిశువు ప్రాణాలు కోల్పోయింది. శిశువును బతికుండగానే ముళ్ల పొదల్లో వదిలిపెట్టడం స్థానికులను కలచివేసింది. ఒకవైపు చీమలు కుడుతుండగా.. ముళ్లు గుచ్చుకుని శిశువు నుంచి రక్తం బయటకొచ్చినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్