దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఆశువులు బాసిన వీరుల త్యాగ ఫలితంగానే అందరం స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటున్నామని శాసనసభ్యులు వెడ్మ బొజ్జు అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.