కడెం: వంతెన పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

56చూసినవారు
ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. శనివారం కడెం మండలంలోని గంగాపూర్, దేవునిగూడెం గ్రామాల మధ్యలో ఉన్న వాగుపై రూ. 22 కోట్ల నిధులతో చేపడుతున్న వంతెన పనులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన మంత్రికి గ్రామస్థులు డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్