ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు

67చూసినవారు
ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిసి ఐక్య ఉద్యమ పోరాట సమితి నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ చట్టసభల్లో రిజర్వేషన్లు పెంచాలని బీసీ కులస్తులు చాలా సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. వారి ఉద్యమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు. అన్ని పార్టీల నాయకులు కూడా తమ ఉద్యమానికి కలిసి రావాలని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి నాయకులు కోరారు.

ట్యాగ్స్ :