దేశ స్వాతంత్రం కోసం ఉద్యమించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుందామని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం అన్నారు. పంద్రాగస్టు సందర్భంగా గురువారం ఉదయం ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.