మహాత్మ జ్యోతిబాపూలే అడుగుజాడల్లో నడవాలి

74చూసినవారు
బలహీన వర్గాల ప్రజల పెన్నిధి మహాత్మ జ్యోతిబాపూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అంబేద్కర్ సంఘం జన్నారం మండల అధ్యక్షుడు భరత్ కుమార్ కోరారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని వివిధ సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఉదయం జన్నారం మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్