పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

84చూసినవారు
పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి పండుగను వీడీసీ సభ్యులు, భక్తులు నిర్వహించారు. ఆదివారం ఆ గ్రామ వీడిసి సభ్యులు, భక్తులు గ్రామంలోని పెద్దమ్మ దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం దేవాలయంలోని పెద్దమ్మతల్లి అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు పడి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ వారు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్