ఉట్నూర్ లో ఈదురు గాలుల బీభత్సం

78చూసినవారు
ఉట్నూర్ లో ఈదురు గాలుల బీభత్సం
ఉట్నూర్ మండలంలోని పలు గ్రామాలలో ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. ఆ మండలంలో మంగళవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం నమోదయింది. ఈదురు గాలులతో పిట్లగూడా గ్రామానికి చెందిన పోశవ్వ ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరింది. అలాగే అదే మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో శివేల్లి అంకన్నకు చెందిన ఎద్దు పిడుగుపాటుతో మృతి చెందింది. ఆ ఎద్దు విలువ రూ. 40 వేల వరకు ఉంటుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్