రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఉట్నూర్ అంబేడ్కర్ చౌక్ వద్ద ఆదివారం ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల బీజేపీ నాయకులు నిరసన దీక్ష నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ పిలుపుమేరకు ఈ ఒక రైతు దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేయడంతో రైతుబంధు రాక, రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నారని వారు తెలిపారు. వెంటనే హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు.