ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ఆదివారం ఉట్నూర్ లో సీఆర్టీ ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. సీఆర్టీ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పందించి కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.