భైంసా మార్కెట్ లో పత్తి ధర 7000

532చూసినవారు
నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్ లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. బుధవారం క్వింటాలు పత్తికి ప్రైవేటులో రూ. 7000 పలకగా, సీసీఐలో రూ. 6920 ధర ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు వెల్లడించారు. గత నాలుగు రోజులుగా ప్రైవేటులో, సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. పత్తికి రూ. 10 వేలకు ధర లభిస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్