బాసర: రోడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు.. గ్రామస్తుల హర్షం

73చూసినవారు
బాసర మండలం ఓని గ్రామం నుండి బాసర మండల కేంద్రం వరకు రోడ్డు నిర్మాణం కొరకు ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం పట్ల బుధవారం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా రోడ్లు సరిగ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో తమ కష్టాలు తీరాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే రామారావు పటేల్ కు ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్