భైంసా పట్టణ శివారులోని నాగ దేవత ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం పూజకు వెళ్లిన స్థానికులు ఆలయంలో ఉన్న హుండీ తాళం పగులగొట్టి ఉండగా పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుయాల్సి ఉంది