కుబీర్ మార్కెట్ లో సీసీఐ పత్తి కొనుగోళ్లు రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత కార్యదర్శి గంగన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు రెండవ శనివారం, రేపు ఆదివారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సెలవు దినం కావడంతో తాత్కాలికంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం కొనుగోళ్లు యధావిధిగా జరుగుతాయని విషయాన్ని రైతులు గమనించి సహకరించాలని కోరారు.