పోషక పాత్ర మన వంట అంగన్వాడీ ఇంట కార్యక్రమం

85చూసినవారు
పోషక పాత్ర మన వంట అంగన్వాడీ ఇంట కార్యక్రమం
ముధోల్ మండలం తరోడా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోషక పాత్ర మన వంట అంగన్వాడీ ఇంట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సంఘం ఆధ్వర్యంలో రాగి జావాను వండి అంగన్వాడి పిల్లలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగుల భాస్కర్, గ్రామ సంఘం అధ్యక్షులు రాధా, అంగన్వాడీ కార్యకర్త తబస్సుమ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్