ఘనంగా నిమజ్జన ఉత్సవాలు

666చూసినవారు
ఘనంగా నిమజ్జన ఉత్సవాలు
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని తోండాల, కోలుర్, సింగన్ గాం, గ్రామాల్లో మంగళవారం రోజున వినాయక నిమజ్జనోత్సవ కన్నులపండువగా జరుపుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై గణనాథుని ప్రతిష్టించి ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఊరేగింపులో యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. భజన పాటల మధ్య వినాయకుడి నిమజ్జనం సాగింది. నిమజ్జనం సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తానూర్ ఎస్సై రాజన్న బందోబస్తు పర్యవేక్షించారు. గ్రామాల్లో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ అధ్యక్షులు రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు సియర్స్వాడ్ రాజు, నాయకులు లక్ష్మన్ రెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్