బాసర ఆర్జీయూకేటీలో రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ను నియమించాలని, సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళన గురువారం రెండో రోజు కొనసాగింది. పరిపాలన విభాగం నుంచి విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ప్రధాన ద్వారం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని చెప్పారు.