పాదయాత్రగా వెళ్తున్న శబరి మాత భక్తులకు అన్నదానం

82చూసినవారు
పాదయాత్రగా వెళ్తున్న శబరి మాత భక్తులకు అన్నదానం
ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, సాంగ్వి గ్రామాల భక్తులు ప్రతి ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలోని తాడ్వయి గ్రామంలోని శబరిమాత ఆలయానికి పాదయాత్రగా వెళ్తుంటారు. గురువారం నిర్మల్ రూరల్ మండలం రాణాపూర్ గ్రామానికి భక్తుల పాదయాత్ర చేరుకుంది. 300 మంది భక్తులకు గ్రామానికి చెందిన జాదవ్ కనిరం అన్నదానం ఏర్పాటు చేసి, వసతి సౌకర్యం కల్పించారు. దీంతో ఆయనకు పాదయాత్ర భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్