స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం దిలావర్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంపీఓ గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యాయులు సదానందం తదితరులు శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే వ్యాధుల బారిన పడకుండా క్షేమంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.