డీసీఎం ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి

83చూసినవారు
డీసీఎం ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి
నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై డీసీఎం ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం సోమవారం మామడ మండలం పులిమడుగు గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఆనంద్ రావు నిర్మల్ వైపు వస్తుండగా వెనక నుండి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ట్రాక్టర్ ఇంజన్ ముందు భాగం బోల్తా పడడంతో డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్