నిర్మల్ లో భారీ గాలి దుమారం

52చూసినవారు
భానుడి భగభగలతో అల్లాడుతున్న నిర్మల్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఆదివారం సాయంత్రం నిర్మల్ జిల్లాలోని మామడ, దిలవార్ పూర్, సోన్, సారంగాపూర్ మండలాల్లో భారీ గాలి దుమారం వీచింది. ఎండ తీవ్రతో ఇబ్బందులు పడ్డ ప్రజలు వాతావరణం చల్లబడి గాలులు వీయడంతో కొంతమేరకు ఉపశమనం పొందారు. మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు పంట కల్లాల వైపు పరుగులు తీశారు.

సంబంధిత పోస్ట్