వైభవంగా శ్రీ సీతారామ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభం

80చూసినవారు
నిర్మల్ రూరల్ మండలం తాంశ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ ధ్వజ శిఖర యంత్ర ప్రతిష్టాపన వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి విగ్రహాలను మహిళలు మంగళ హారతులతో భాజా భజంత్రీల నడుమ గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు జరిపారు. శుక్రవారం స్థాపిత దేవతమూర్తుల పూజలు, శనివారం ప్రతిష్టాపన స్వామివారి కల్యాణం, అన్నదానం ఉంటుందని శ్రీ రామాలయ కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్