ఈ నెల 14న కడ్తాల్ లో విషు పూజ మహోత్సవం

73చూసినవారు
ఈ నెల 14న కడ్తాల్ లో విషు పూజ మహోత్సవం
సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప ఆలయంలో ఈనెల 14న విషు పూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ గురుస్వామి నర్సారెడ్డి గురువారం తెలిపారు. పూజ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకం, అర్చన, విశేష హారతి పూజ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం ఉంటుంది తెలిపారు. విషు పూజ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్