44వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం

78చూసినవారు
44వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం
ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 44 వ వారం ఉత్సాహంగా నిర్వహించారు. కాలనీవాసులు కలిసి ఉత్సాహంగా శ్రమదానం చేశారు. ఈ సందర్బంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్