ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్జాపల్లి గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఎస్సై సత్యనారాయణ బుధవారం తెలిపారు. వారి వద్ద నుండి 23, 480 రూపాయలు, 3 సెల్ ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాట ఆడితే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.