ఆలూర్: కుంటలో పడి వ్యక్తి మృతి

83చూసినవారు
ఆలూర్ మండల కేంద్రంలో వెంకటేశ్వర గుట్ట ప్రక్కన ఉన్న నీటి కుంటలో గురువారం మృతదేహం లభ్యమైంది. ఆర్మూర్ ఎస్ఐ తిరునగరి గోవింద్ వివరాల ప్రకారం తీర్మాన్ పల్లి ముత్తెన్న (55)అని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. కావున పోస్టుమార్టం మృతిదేహం వద్దనే నిర్వహించారు. అతనికి మతిస్థిమితం లేదని కుటుంబీకులు తెలిపారు. గత నాలుగు రోజుల నుండి కనబడుటలేదని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్