తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ డిపో అరుణాచల గిరిప్రదక్షణ యాత్రకు బస్సు సర్వీసును ప్రారంభించింది. జనవరి 4 శనివారం ఆర్మూర్ డిపో నుంచి మధ్యాహ్నం 3. 00 గంటలకు బయలుదేరనుంది. అరుణాచలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, జోగులాంబకు సర్వీసును వినియోగించుకోవాలని ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ మోహన్ తెలిపారు.