జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరులో శనివారం మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకుల సమావేశం ఏర్పాటు చేసి సూచనలను సలహాలను మండల విద్యాధికారి ఎం నరేందర్ ఇచ్చారు. నూనె, పప్పు, పసుపు ,మిర్చి ఐఎస్ఐ మార్కు గల మంచి క్వాలిటీ కూరగాయలు వాడాలని చెప్పారు. మధ్యాహ్న భోజనం క్వాలిటిని చూడడానికి ప్రతి పాఠశాలలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.