ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మార్ గార్డెన్ లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 150 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏసీబీ, సీఐ రవి కుమార్, వైస్ చైర్మన్ మున్నాభాయ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.