గణిత శాస్త్రంపై ప్రతి విద్యార్థి పట్టు సాధించాలని మెండోరా మండల విద్యాధికారి దేగం శ్రీనివాస్ అన్నారు. శనివారం మెండోరా మండలంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు గణిత శాస్త్రంపై ప్రతిభా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గణిత మండల అధ్యక్షులు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, దేవన్న, భూపతి, సుధా తదితరులు పాల్గొన్నారు.