బాల్కొండ పంచాయతీరాజ్ సబ్ డివిజన్ లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గడ్డం మహేందర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఆదివారం రైతు బజార్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్, ఈఈ పీఆర్ సబ్ డివిజన్ ఆర్మూర్, బావన్న ఎస్ఈ నిజామాబాద్ పీఆర్ సర్కిల్ ముఖ్య అతిథిగా రమేష్, కిషన్ డిప్యూటీ ఈఈలు పాల్గొని, మహేందర్ రెడ్డి పూలమాల శాలువతో సత్కరించారు.