బోధన్ మండల కేద్రంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్యశిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుమన్ ధన్వంతరి విగ్రహానికి పూలమాలలు వేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వృద్ధులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు.