తెలంగాణ రచయితల సంఘం స్థాపించబడి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 8వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రచయితల సంఘం"పదేండ్ల సాహిత్య సభలు"నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్ తెలిపారు. శుక్రవారం కేర్ డిగ్రీ కళాశాలలో సమావేశానికి సంబంధించిన కరపత్రాలను విడుదలచేశారు. తెలంగాణ అస్తిత్వ సాహిత్యం వర్తమాన సందర్భం అనే అంశంపై ఈ సాహిత్య సభలు నిర్వహిస్తున్నామన్నారు.