కమ్మర్ పల్లి మండలం కొనసముందర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన బలేరావు సాయమ్మ, మునుగంటి నర్సయ్య కుటుంబాలను ఆదివారం బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఈయన వెంట గ్రామ అధ్యక్షులు జేడీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, భూచన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి, సతీష్, సుధాకర్, భూమరెడ్డి, హనుమన్లు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.