వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వృధాగా నీళ్లు పోతున్నాయి. కొన్ని చోట్ల తాగేందుకు నీళ్లు లేక ప్రజలు అల్లాడుతుంటే.. ఇక్కడ నీళ్లు వృధాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ లీకేజీకి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.