వేల్పూర్ మండల కేంద్రానికి నూతంగా బదిలీపై వచ్చిన ఎస్సై సంజీవ్ ను ఆదివారం బాల్కొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆత్మరామ్ శాలువాతో ఘనంగగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించిన తన దృషికి తీసుకరవాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు అక్లూర్ మల్లారెడ్డి, అర్ముర్ మోహన్, మాదవేడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.