బోధన్ ఎమ్మెల్యే ముహమ్మద్ షకీల్ అమీర్ ఆదేశాల మేరకు శుక్రవారం రెంజల్ మండల నాయకులు లోతట్టు ప్రాంతాలకు, మహారాష్ట్ర సరిహద్దు పైన గోదావరి బ్రిడ్జ్ను సందర్శించారు. రైతులందరు రెండు మూడు రోజులు పొలాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎంపీటీసీ అసద్, మండల బిఆర్ఎస్ ఐటీ సెల్ ఇంచార్జి ముకీద్, నాయకులు గౌసుద్దీన్, ఉబెబ్ అలీ, జలీల్ అహ్మద్, నిజముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.