టీజీవీపి ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని డిప్టీ కార్యాలయంలో మంగళవారం శ్రీకాంత్ చారి వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి డివిజన్ అధ్యక్షులు మిసాలే నగేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.