బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ సతీమణి,అయేషా చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఆయేషా ఫాతిమా సహాయ సహకారాలతో బోధన్ పట్టణంలోని 24వ అవార్డు హనుమాన్ టెకిడిలో ఆదివారం బోరు బావి వేయించి ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పించారు. వార్డ్ కౌన్సిలర్ సుధారాణి రవీందర్ యాదవ్ హనుమాన్ టెకిడి ప్రజల తరపున ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సేవలు ప్రజల గుండెల్లో ఉంటాయని పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ అన్నారు.