ఎడపల్లి మండలంలోని ఏ. ఆర్. పి క్యాంప్ గ్రామంలో పద్మశాలి కులస్తులు అత్యంత నియమ నిష్ఠలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా పద్మశాలి కులస్తులు డప్పు వాయిద్యాలతో పోచమ్మ గుడికి వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని పోచమ్మ తల్లిని వేడుకొన్నారు. ఈ సందర్భంగా సంఘం పెద్దలు జజరి శివరాజు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ గ్రామంలో పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుందని అన్నారు.