చందూర్ మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను శుక్రవారం అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్ అకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో వంట సామాగ్రి, సరుకులు, కూరగాయలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులతో సిలబస్ పై ముచ్చటించారు. తదుపరి ఘనపూర్ గ్రామంలోని ఇంటింటి సర్వే ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శాంత, ఎంపీడీవో నీలావతి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.