చందూర్ మండల కేంద్రంలో బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎం కప్పు ఆటల పోటీలను ఎంపీడీవో నీలావతి ప్రజా ప్రతినిధులతో కలసి ప్రారంభించారు. క్రీడలు విద్యార్థులకు శారీరక, మానసిక వికాసానికి అత్యంత దోహదపడతాయని విద్యార్థులు శారీరకంగా ఎదుగుతారని అన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశార. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నీలావతి, మాజీ ఎంపీపీ లావణ్య, దశాగౌడ్ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.