ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ

498చూసినవారు
ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ
రంజాల్ మండలము పేపర్ మిల్లు నీలా గ్రామంలో గ్రామ సర్పంచ్ మరియు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కేసీఆర్ ఆడపడుచుల కొరకు చీరలను రాష్ట్రంలో అన్ని ఊర్లలో ప్రతి ఇంటికి ప్రతి మహిళకు పంపిణీ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు సోషల్ మీడియా కన్వీనర్ అబ్దుల్ ముఖేద్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హలీమా బేగం ఫారుక్ ఖాన్, ఉప సర్పంచ్ సామ్రీన్ బేగం సిరాజుద్దీన్, బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాస్మీన్ బేగం, నాయకులు, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్