యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన నాగుల రాజు గౌడ్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో జిల్లా ప్రధాన కార్యదర్శి గా గెలుపొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్ల రామ్మోహన్, కాంగ్రెస్ నాయకులకు గురువారం కృతజ్ఞతలు తెలిపారు.