నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఔదారి రంజిత్ కుమార్ ఎన్నికయ్యారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన ఓటింగ్ లో రంజిత్ కుమార్ బుధవారం ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ ను గ్రామ గ్రామాన పటిష్టం చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాలలో వివరిస్తానని అన్నారు. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో గ్రామాలలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు.