తెలంగాణ వెల్ నెస్ సెంటర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నిక

269చూసినవారు
తెలంగాణ వెల్ నెస్ సెంటర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నిక
తెలంగాణ వెల్ నెస్ సెంటర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. వనస్థలిపురం డివిజన్ అభ్యుదయ నగర్ కాలనీలో కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ గంధం శాంతి కుమార్, ఎన్నికల అధికారి అభిలాష్ లు హాజరై కమిటీ ఎన్నిక జరిపారు. నూతన అధ్యక్షుడిగా డాక్టర్ రిజ్వాన్ మహ్మద్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా డాక్టర్ రాకేష్ ప్రతాని, డాక్టర్ శాంతి కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జ్యోతిర్మయి, జి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జి సమీర్, కోశాధికారిగా డాక్టర్ అనిత ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా యాదగిరి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా డాక్టర్ విద్యా సాగర్, భరత్ కుమార్, సన్నీ, సుజాత తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ర్ట వెల్ నెస్ సెంటర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గంధం శాంతి కుమార్, ఎన్నికల అధికారిగా బొబ్బిలి అభిలాష్, ఆశ్రీత్ కుమార్ లు హాజరై మాట్లాడుతూ.. వెల్ నెస్ సెంటర్ లకు వచ్చే రిటైడ్ ఉద్యోగులకు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్