బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారిని పేపర్ మిల్లు నీల గ్రామ నాయకులు అందరూ కలిసి పలు గ్రామ సమస్యలపై చర్చించడం జరిగినది మండల్ సోషల్ మీడియా ముఖిద్ చేప్పిన ప్రకారం గ్రామంలో ప్రాథమిక పాఠశాల యొక్క కాంపౌండ్ వాల్ మరియు మైనారిటీ గ్రేవ్ యార్డ్ కాంపౌండ్ వాల్ పేదలందరికీ టూ బెడ్ రూమ్ ఇల్లు అలాగే గ్రామంలో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని చెప్పగా ఎమ్మెల్యే తక్షణమే పాఠశాల యొక్క కాంపౌండ్ వాల్ వాటర్ ప్లాంట్ చేస్తానని హామీ ఇచ్చారు.
మరియు టు బెడ్ రూమ్ ఇల్లు పేదలకు అందే విధంగా తప్పకుండా సర్వే నిర్వహించి వాళ్ళని అందరిని తప్పకుండా ఇస్తానని హామీ ఇచ్చారు. వీళ్ళందరూ తో పాటు మండల టీఆర్ఎస్ సోషల్ మీడియా అబ్దుల్ ముఖీద్ జూబేర్ఉద్దీన్ అధ్యక్షులు అవేజ్ ఖాన్, కుద్రత్ ఖాన్, ఏజాజ్ ఖాన్, యన్. విష్వనాధ్, దౌలత్ ఖాన్, అఫ్రోజ్, దిల్షద్ పాష, సులెమన్ ఖాన్, మజిద్ ఖాన్, ఇబ్రహీం ఉద్దీన్, సమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.