కల్దుర్కిలో ఎస్సెస్సీ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యే హామీ

52చూసినవారు
కల్దుర్కిలో ఎస్సెస్సీ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యే హామీ
బోధన్ మండలం కల్దుర్కి హై స్కూల్ లో పదవ తరగతి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పాఠశాల హెచ్ఎం నాగయ్య, గ్రామస్థులు వినతి పత్రం సమర్పించారు. ప్రతీ ఏడాది పరీక్షలు రాయడానికి పిల్లలు పెంటాఖుర్దు పాఠశాలకు ఆటోల్లో ఇబ్బందులతో వెళ్తున్నారని తెలియజేయగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ప్రోవిజన్ ఉంటే తప్పకుండా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్