సాటాపూర్ కి చెందిన వడ్ల భూమేష్ ఆదివారం మోస్రా నుండి సాటాపూర్ కి బైక్ పై గేట్ మీదుగా వెళ్తుండగా అంబేద్కర్ కాలని వద్ద ఐచర్ వాహనం ఢీకొట్టింది. దాంతో భూమేశ్ కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు గమనించి 108 కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏడపల్లి 108 సిబ్బంది లక్ష్మణ్, నరేష్ లు ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతని వద్ద గల 3520 రూపాయలు, ఫోన్ ను పోలీసులకు అప్పగించారు.